గిరిజన ప్రాంతానికి న్యాయం చేయండి..

  • కార్పొరేషన్ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని..

  • తెలంగాణ గవర్నర్ ను కలిసిన గిరిజన సంఘాల నాయకులు

  • భూక్య సంజీవ్ నాయక్ సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు

  • బాణావత్*హుస్సేన్ నాయక్ సేవాలాల్ సేన రాష్ట్ర కో- కన్వీనర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జనవరి17(తెలంగాణ కెరటం): ఏజెన్సీ ప్రాంతం అయిన కొత్తగూడెం పరిసర ప్రాంతాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ‘కూడా’ గా చేయడాన్ని పలు గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతం అయిన కొత్తగూడెం జిల్లా ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, ఇక్కడ పేద, మధ్యతరగతి గిరిజనులు అధికంగా ఉంటారని అన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, న్యాయవాది లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర కోకన్వీనర్బానోత్ హుస్సేన్ నాయక్, ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు భాడిష బిక్షం, టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బానోత్ రాములు నాయక్, టీఎస్ టీటీఎఫ్ జిల్లా నాయకులు సపావత్ బాలకృష్ణ, సేవాలాల్ సేన నాయకులు బట్టు కృష్ణ, బట్టు వీరన్న, వీరు నాయక్, జరుపుల పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment