వరి కొయ్య కాళ్లు కాల్చవద్దు
-కాల్చడం వల్ల భూసారానికి ముప్పు
-ఏ డి ఏ అనిల్ కుమార్
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 19,
వరి కొయ్యలను కాల్చవద్దని పొలంలో కలియదున్నుతే భూసారం పెంపొందుతుందని ములుగు డివిజన్ వ్యవసాయ సంచాలకులు అనిల్ కుమార్ సూచించారు.గురువారం నాడు మర్కుక్ మండల పరిధిలో గల ఎర్రవల్లి గ్రామంలో క్షేత్ర సాయి సందర్శన జరిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చడం వలన నత్రజిన్,ఫాస్ఫరస్ పోషకాలు తగ్గుతాయిని,మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయని వివరించారు.కొయ్యలు నేలలో కలియదునుతే కార్బన్ శాతం పెరుగుతుందని,దుక్కి దున్నే సమయంలో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ చల్లితే రెండు వారాల్లో అవశేషాలు మురిగిపోయి,పోషకాలు అందుతాయన్నారు.వారితో పాటు మండల వ్యవసాయ విస్తరణ అధికారి విష్ణువర్ధన్,రైతులు తదితరులు ఉన్నారు.