అయ్యప్ప దేవాలయ అభివృద్ధి పనులకు విరాళాలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 19 : కోరుట్ల అయ్యప్ప దేవాలయంలో సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు గాను కోరుట్ల వాస్తవ్యులు, స్నేహశీలి, (లిటిల్ ఫ్లవర్ హైస్కూల్) తుమ్మనపెళ్లి సత్యనారాయణ-భారతి దంపతులు 21,116/- రూపాయలు, ఆలయ శాశ్వత సభ్యులు, అయ్యప్ప సేవాతత్పరుడు, కార్యదీక్షాపరుడు వాసాల నరేందర్-లావణ్యదంపతులు 51,116/- రూపాయలు, కోరుట్ల వాస్తవ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త గుంటుక నీలేష్-మధురిమ దంపతులు 21,116/- రూపాయలు, కోరుట్ల వాస్తవ్యులు, బిల్డింగ్ వుడ్ వర్క్స్ నిపుణులు మహదేవోజి రాజు-మానసవీణ దంపతులు 21,116/- రూపాయలు విరాళాలు అందజేసినట్లు ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురుస్వామి గురువారం తెలిపారు. ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.