పిర్యాదు చేసినా పట్టించుకోరా.
ఇప్పటికే ఒకరు మృతి చెందినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకు
కమీషనర్ కు కమీషన్ పై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై లేదు
బిజెపి బొల్లారం పట్టణ అధ్యక్షుడు కెజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి
తెలంగాణ కెరటం డిసెంబర్ 26 బొల్లారం మున్సిపాలిటీ పటాన్ చెరువు ప్రతినిధి
మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయని పిర్యాదు చేసి ఇరవై రోజులు గడుస్తున్నా కమీషనర్ పట్టించుకోవడం లేదని బొల్లారం బిజెపి పట్టణ అధ్యక్షుడు కెజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆరోపించారు. తాను స్వయంగా ఆ మురుగు కాల్వ గురించి వీడియోలు తీసి పిర్యాదు చేయడం జరిగిందని ఇరవై రోజులు గడుస్తున్నా కమీషనర్ పట్టించుకోకపోవడం ఆమె నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని ఆనంద్ కృష్ణారెడ్డి విమర్శించారు. ఇప్పటికే అదే మురుగు కాల్వలో పడి పారిశుద్ధ్య కార్మికుడు నరసింహ దుర్మరణం చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ మురుగు కాల్వ మీదుగా ఎంతో మంది చిన్నారులు మహిళలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని అదేవిధంగా ఎన్నో వాహనాలు ప్రయాణాలు సాగిస్తున్నాయని దీంతో పాటు ఆ మురుగు కాల్వను ఆనుకుని ఎన్నో నివాసాలు ఉన్నాయని ఎదైనా ప్రమాదం జరిగితే భాద్యత ఎవరు తీసుకుంటారని ఆయన నిలదీశారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ మంగతాయారు కు వీడియోలు తీసి ఇరవై రోజుల క్రితమే పిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. అయినప్పటికీ ఇంతవరకూ స్పందించకపోవడం ఆమె నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని కమీషన్ కోసం మాత్రమే పనులు చేస్తారా ఇలాంటి సమస్యలపై పట్టించుకోరా అని ఆనంద్ కృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయకపోతే తదుపరి కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.