డాక్టర్ ‘ కొరిపల్లి’ కి ఘన సన్మానం

డాక్టర్ ‘ కొరిపల్లి’ కి ఘన సన్మానం
ఖమ్మం, ఫిబ్రవరి02 (తెలంగాణ కెరటం):
తెలంగాణ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు
కొరిపల్లి శ్రీనివాస్ కు
గౌరవ డాక్టరేట్ వరించడంతో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆదివారం వారి నివాసానికి వెళ్లి శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు పడిశాల వెంకన్న, కనకపుడి వీరస్వామి మాదిగ మాట్లాడుతూ.. మీరు మీ కూతురు వేద సన్నిహిత, తల్లిదండ్రులు వెంకయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషం కలిగిస్తుందని ఇకపై మరిన్ని సేవలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ వెంకట్ మాదిగ, చెరుకుపల్లి చిన్న భద్రయ్య మాదిగ, పోలే పొంగు పుల్లయ్య మాదిగ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment