కోరుట్ల, మెట్పల్లి స్త్రీ వైద్య నిపుణుల అసోసియేషన్ అధ్యక్షురాలిగా డా.స్వీతి అనూప్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 19 : కోరుట్ల, మెట్పల్లి స్త్రీ వైద్య నిపుణుల అసోసియేషన్ అధ్యక్షురాలిగా డా.స్వీతి అనూప్ ఎన్నికయ్యారు. కోరుట్ల పట్టణంలలో గురువారం జరిగిన గైనకాలజిస్టుల సమావేశములో కోరుట్ల, మెటుపల్లి అబస్ట్రేటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ సొసైటి ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా డా.స్వీతి అనూప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డా.అనురాధ వేణుగోపాల్, డా.బోగ శ్రీలత, కార్యదర్శిగా డా.హెప్సిబా జేకబ్, సహాయ కార్యదర్శిగా డా.మానస, డా.రాజ్యలక్ష్మి, కోశాధికారిగా డా.జ్యోత్స్న రమేష్, ఉపకోశాధికారిగా డా.శృతి అన్వేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన డాక్టర్ స్వీతి అనూప్ మాట్లాడుతూ కార్యవర్గాన్ని ఏకగ్రీవముగా ఎన్నుకున్న సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. మహిళా వైద్యుల సమస్యలను ఐక్యంగా పరిష్కరించుకుంటామన్నారు. స్త్రీల వ్యాదులు, సమస్యలు, సురక్షత పట్ల ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. కార్యవర్గ ప్రమాణ స్వీకారం డిసెంబర్ 22 తేదిన ఇష్టా రెస్టారెంట్ బాంకెట్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.