మాదకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం మరియు పోస్టర్ ఆవిష్కరణ, ప్రతిజ్ఞ ప్రోగ్రాం
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19 .
నషా ముక్త్ భారత్
అభియాన్ ప్రోగ్రాం లో భాగం గా జిల్లా కలెక్టర్ అదేశానుసారం ఈరోజు జిల్లా లోని అన్ని మండలలో పోస్టర్ ఆవిష్కరణ మరియు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించటం జరిగినది . సూర్య పేట జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సూర్యాపేట లో అవగహన కార్యక్రమము మరియు పోస్టర్ ఆవిష్కరణ, ప్రతిజ్ఞ నిర్వహిచటం జరిగినది ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహ రావు, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడివో మాట్లాడుతు యువత మత్తుపదార్దాలకు బానిస కావొద్దు అని అన్నారు, జీవితాలను మరియు వృత్తిని ప్రభావితం చేసే మాదకద్రవ్య వ్యసనానికి గురికాకుండా విద్యార్థులను, యువకులను తల్లి దండ్రులు చూడాలని అన్నారు.మాదక ద్రవ్యాల వాటి నివారణ పై అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం సిడిపీవో,సూపర్ వైజర్స్, ప్రిన్సిపాల్,అధికారులు , కార్యాలయ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమఅధికారి,మహిళా ,శిశు ,దివ్యాంగులమరియు వయో వృద్ధుల శాఖ, సూర్యాపేట జిల్లా