మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన దుబ్బాక కాంగ్రెస్ నేతలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన దుబ్బాక కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కెరటం దుబ్బాక:డిసెంబర్27,

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని తల్లి తెలంగాణ చౌరస్తా వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీరామ్ నరేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తునికి సురేష్,సత్తు శ్రీనివాస్ రెడ్డి, మల్లుగారి రామచంద్ర రెడ్డి, గార్లు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment