---Advertisement---

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో వరుస ప్రమాదాలు 

---Advertisement---

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో వరుస ప్రమాదాలు 

 

– మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్తున్న కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పాటు స్ధానిక బిఆర్ఎస్ నాయకులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోరుట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లడుతూ మెట్పల్లి మండలం పెద్దాపుర్ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను అక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని కోరారు. గత కొన్ని నెలల క్రితమే ఇద్దరు విద్యార్ధులు పాము కాటుకు గురై చనిపోయారని, ఇప్పుడు మరో ఇద్దరు విద్యార్ధులు పాము కాటుకు గురి కావడం ఆందోళనకరమని అన్నారు. పెద్దపూర్ గురుకులం ఒక నాడు ఎంతో కీర్తి పొందిందని ఇప్పుడు అపకీర్తి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తదితర మంత్రులు పెద్దాపుర్ గురుకులాన్ని సందర్శించి 50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో గురుకుల పాఠశాలలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా మా ప్రభుత్వం చూసిందని అన్నారు. కాంగ్రెస్ వచ్చిన సంవత్సర కాలంలోనే గురుకులంలో ఎన్నో ప్రమాదాలు జరగడం బాధాకరమని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూలు కడతామని ప్రజలు మభ్యపెడుతూ ఉన్న స్కూళ్లకు నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గురుకులాలను కాపాడాలని కోరారు. అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్ నాయకులు దరిశెట్టి రాజేష్, ఫహీం, బట్టు సునీల్, అతీక్, యాటం కృష్ణ, చీటి వెంకట్ రావు, పేర్ల సత్యం, ఆర్బాజ్, చిత్తారి ఆనంద్ తదితర నాయకులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment