ఆర్థిక విద్వంసం..
కేసిఆర్ ప్రభుత్వం..ఖాళీ ఖజానా చేతికి ఇచ్చినా.
మెదక్ జిల్లా అభివృద్ధి పరిఢవిల్లుతుంది.
– మైనార్టీల రక్షణ, అభివృద్ధి నా ధ్యేయం
– ముస్లీం మైనార్టీల కోసం పెద్దఎత్తున నిధులు తీసుకువస్తాను
– మెదక్ జిల్లాలో హజ్ హౌజ్, మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడ్తా
– పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో మెదక్ చర్చికి 10 రూపాయలు ఇవ్వని నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు
– మెదక్ నియోజకవర్గానికి సవతితల్లిగా చూసిన మాజీ మంత్రి హరీష్ రావు, కవిత
– రాజకీయాలకోసం మెదక్ ప్రాంతం కావాలి.అభివృద్ధికి సిద్దిపేట కావాలి.
– ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకోని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మెదక్ ప్రజలను వంచించిండు…
– ముందుంది అసలు రాజకీయం.మెదక్ లో రాజకీయ చరిత్రను తిరిగి రాస్తా..
– మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 26:
మెదక్ నియోజక వర్గం అభివృద్ధి ఏలా ఉంటుందో ఒక ఏడాది కాలంలోనే ప్రజలు గుర్తించేలా 780 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ గురువారం వెళ్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎమ్మెల్యేగా గెలుపొందిన సంవత్సరంలోపే సామాజిక న్యాయం కులమతాలకు అతీతంగా సంపూర్ణంగా జరిగిందని పేర్కోన్నారు. సంక్షేమం, అభివృద్ధి పాలనల మధ్య సమతూల్యత… సమగ్రంగా సాక్షి బూతం అయ్యిందన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకోని అతి చిన్నవయస్సులో ఎమ్మెల్యే గా నేను గెలుపొందానని ఆయన గుర్తుచేశారు. మెదక్ చర్చికి కనివినీ ఎరుగని రీతిలో 29 కోట్ల 18 లక్షల 50 వేల రూపాయలు నిధులను వందేళ్ళ చర్చికి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇచ్చిన తీరును చూసి గురువులు చర్చిలో ప్రార్థనలు, ప్రసంగాలు ప్రపంచానికి చర్చి గుడి గంటల ద్వారా అభివృద్ధి నినాదాలు మారుమ్రోగాయి. అలాగే పది సంవత్సరాల కాలంలో ఒక్కసారిగా కూడా ఏడుపాయల దుర్గామాతను దర్శించుకోని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ సిగ్గుతో తలవంచుకోవాలని ఎద్దేవ చేశారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రావడం… 780 రూపాయల కోట్లతో శంకుస్థాపన జరిగిన తీరు మెదక్ జిల్లా చరిత్ర లో నిలిచిపోతుంది.
మెదక్ జిల్లా మైనార్టీల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా.మెదక్ నియోజక వర్గ మైనార్టీల ముస్లీంల కోసం.శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. హజ్ హౌజ్, తాజ్ మినార్, మైనార్టీ ఫంక్షన్ హాల్ లను నిర్మాణం చేపడ్తానని… మొదటి సంవత్సరంలో ఖాళీ ఖాజాన చేతికిచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో విద్వంసం నుంచి వికాసం వైపు రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు తీసుకెల్తున్నారని ఆయన కొనియాడారు. ఈ స్థితిలో మెదక్ నియోజక వర్గానికి 780 కోట్లు మంజూరు చేయడం ఆశామాషీ కాదని ఆయన అన్నారు.
సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా సుసంపన్నం చేస్తా.మెదక్ నియోజక వర్గంలోని ఏడుపాయల దుర్గాభవాని, మెదక్ రాచవీడు ఖిల్లా, ప్రపంచఖ్యాతి గాంచిన చర్చి, పోచారం అభయారణ్యం… కోంటూర్ చెరువు లను అత్యాదునిక పర్యాటక కేంద్రాలుగా ఒక హబ్ గా తీర్చిదిద్ది.ప్రపంచ పర్యాటకులు ఆకర్షించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ తెలిపారు.
రాజకీయ చరిత్రను తిరిగి రాస్తాను.రాజకీయాల కోసం వాడుకునే నాయకులకు మెదక్ ప్రాంతం కావాలని.అభివృద్ధికి మాత్రం మెదక్ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని నాయకులకు రాజకీయం అంటే ఎంటో అసలు రంగు ముందుంది చూపిస్తా అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. రాజకీయాల కోసం మెదక్ ప్రాంతం కు వచ్చి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై నిందలు వేయడం సరియైంది కాదని ఆయన హెచ్చరించారు.