ఏడుపాయల దేవస్థానం ఏ+ గ్రేడ్ గా అప్ గ్రేడ్.

ఏడుపాయల దేవస్థానం ఏ+ గ్రేడ్ గా అప్ గ్రేడ్.

 

త్వరలోనే దేవాలయం కు అడీషనల్ కమీషనర్

 నియామకం…?

 

ఏడుపాయల అభివృద్ధికి సిఎం, దేవాదాయశాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్

 

అడీషనల్ కమీషనర్ రాకతో అభివృద్ధికి సుస్థిర మార్గం.

 

నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ రావు.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 29:

 

తెలంగాణ రాష్ర్టంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం ఇకమీద ఏ+ గ్రేడ్ గా అప్ గ్రేడ్ గా కాబోతుందని నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కోన్నారు.ఇట్టి విషయమై ఇటీవల ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రతిపాదనలు అందించామని ఇట్టి విషయమై రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు స్పందించి ఏడుపాయల దేవస్థానంను అతిత్వరలోనే ఏ+ గ్రేడ్ గా అప్ గ్రేడ్ గా తీర్చిదిద్దబోతున్నట్లు ఆయన పేర్కోన్నారు.అంతే కాకుండా ఏ+ గ్రేడ్ గా అప్ గ్రేడ్ అవుతే దేవాలయం కు అడీషనల్ కమీషనర్ పోస్టు ఏర్పడడంతో అడీషనల్ కమీషనర్ నియామకం అవుతారని ఆయన అన్నారు. అంతే కాకుండా అడీషనల్ కమీషనర్ ఏడుపాయల దేవస్థానం కు అవుతే అభివృద్ధి మరింత వేగవంతంగా చేసుకోవచ్చునని ఆయన అన్నారు.అడీషనల్ కమీషనర్ తో అభివృద్ధికి సుస్థిర మార్గంగా ఏర్పాటు అవుతుందని ఆయన పేర్కోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment