విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి,
కేజీబీవీ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డీఈవో ఏ. రమేష్ కుమార్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్
ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార విధానం ద్వారా ఉపాధ్యాయులంతా తరగతి బోధన చేసి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ సూచించారు.
శనివారం నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాకొండా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని నాగర్ కర్నూల్ డిఇఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి గదిలో ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయురాలి బోధన ప్రక్రియను విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విన్నారు.
కేజీబీవీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధన పద్ధతులను డిఇఓ పరిశీలించారు.అనంతరం డీఈఓ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ
ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల, పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఉపాధ్యాయుల కృషివల్లే ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతం అవుతుందని, ఆత్మసాక్షిగా, పట్టుదలతో పనిచేస్తే పాఠశాలస్థాయి మరింత ఉన్నతంగా మారుతుందని, తద్వారా రాబోయేతరం నాణ్యమైన సమాజాన్ని నిర్మిస్తుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేకమంది ఉన్నతమైన స్థానాలు అధిరోహించారని, ప్రస్తుతం ఉన్న స్థితిగతులు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, కల్పించబడ్డ వసతు లు, అలాగే విద్యార్థుల గొప్పతనాన్ని ప్రదర్శనలని, విద్యార్థుల ఫలితాలు అందరికి తెలిసేలా ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలిసేలాగా చేయాలన్నారు.రానున్న పదవ తరగతి ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లాను
రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్థానాల్లో మెరుగుపరిచేలా సబ్జెక్టు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.పదవ తరగతి విద్యార్థుల వారాంతపు టెస్టులు నిర్వహించి విద్యార్థుల సామర్ధ్యాల ఆధారంగా బోధన చేయాలని, ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సెలవుపై వెళ్తున్న ఉపాధ్యాయుడు ముందస్తుగా సెలవులను మంజూరు
చేయించు కోవాలని, తరగతి గదిలో జరిగే బోధన విధానాన్ని విద్యార్థులు చేసే కృత్యాలను తల్లిదండ్రులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపించాలన్నారు.
ప్రతి మూడో శనివారం జరిగే పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో పిల్లల యాక్టివిటీస్‌ని తెలియజేయాలని సూచించారు.తెలకపల్లి మండల పరిధిలోని రాకొండ కేజీబీవీని సందర్శించి విద్యార్థులతో డిఇఓ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, సమయాన్ని వృధా చేయకుండా విద్యపై దృష్టి సారించి, ఉత్తమ ఫలితాలు పొందాలని డీఈఓ విద్యార్థులకు సూచించారు.
డీఈఓ వెంట నాగర్ నాగర్ కర్నూలు జిల్లా కేజీబీవీల పర్యవేక్షణ అధికారిని శోభారాణి, తెలకపల్లి ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.