*పిల్లల్లో అవగాహన శక్తి పెంపొందేలా కృషి చేయాలి.
తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(23)
చిన్నారులు మంచి పరివర్తన కల్గి ఉంటూ , వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగన కల్గి ఉండేలా వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుక అన్నారు.దూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి లో సోమవారం రిలయన్స్ ఫౌండేషన్ మరియు క్రై ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లో అంగన్వాడి సహాయకురాళ్ళకు ఈసీసీ ప్రాజెక్టులో భాగంగా ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల చిన్నారులు మంచి ప్రవర్తనను పెంపొందించుకుంటూ తమ పనులను తాము నిర్వహించుకునేలా అంగన్వాడి సహాయకులు కృషి చేయాలన్నారు. అనంతరం అంగన్వాడి ఉపాధ్యాయులు లేని సమయంలో చిన్నారులకు బోధనా ఎలా చేయాలనే అముషాలను సీఆర్ పి లు నారదాసు ఉమాదేవి, మంద భార్గవి లు అంగన్వాడి సహాయకురాళ్లకు వివరించారు. ఈ కార్యక్రమములో జిల్లా కో ఆర్డినేటర్ రాజలింగం, బ్లాక్ కు ఆర్డినేటర్ సరిత పాల్గొన్నారు.