మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడిగా బోయిని రాజు ముదిరాజ్ ఎన్నిక.
ఎమ్మెల్సీ బండ ప్రకాష్, మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మానగల రామకృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందజేత.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 27:
మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడిగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన బోయిని రాజును జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ఎమ్మెల్సీ బండ ప్రకాష్, మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మానెగండ్ల రామకృష్ణయ్య లో నియామక పత్రాన్ని రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ముదిరాజ్ కులస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని వారు రాజుకు సూచించారు. వారు చెప్పిన విధంగా ముదిరాజ్ కులానికి సేవ చేస్తానని రాజు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులానికి చెందిన ఎవరైనా సరే సర్పంచ్ గాని, జడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులుగా పోటీ చేస్తే వారికి మద్దతు తెలిపి గెలిచే విధంగా చూడాలని వారు రాజుకు సూచించారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్ ముదిరాజ్ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈమెకు ఈనెల 26వ తేదీన కేవలం కిషన్ వర్ధంతి సందర్భంగా అక్కడికి వచ్చిన బండ ప్రకాష్, నీల మధు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్ ముదిరాజ్, మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మానెగండ్ల రామకృష్ణయ్య ముదిరాజ్ లు రాజుకు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందజేశారు.