టీజీ టీటీఎఫ్​ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి17 (తెలంగాణ కెరటం): జిల్లా కేంద్రంలో తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ (టీజీటీటీఎఫ్) ఆధ్వర్యంలో మాలోత్ రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకు న్నారు. తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తమ కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 604 మండ లాలకు గాను కేవలం 44 మండలాలు ఏజెన్సీ మండలాలు ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంత హక్క ల పరిరక్షణ కోసం భారత రాజ్యాంగం 5, 6వ షెడ్యూల్ ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించిం దని అన్నారు. నాగరికతకు దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత గిరిజన తండా, గుడాలలో విద్య వ్యాప్తి జరిగిందన్న, మొదటి తరం గిరి జన యువత, ఉపాధ్యాయులుగా వేల మంది అయ్యారంటే అది కేవలం జీఓ 3 వలనే జరి గిందన్నారు. అలాంటి జీఓ.3ను సుప్రీంకోర్టు కొట్టేయడం వల్ల ఏజెన్సీప్రాంత నిరుద్యోగ యు వతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయా యన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఏజెన్సీ ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం టి.ఏ.సి (ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్) ఏర్పాటు చేసి జిఓ 3 కి బదులు కొత్త జిఓ తీసుకురావాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులు 100% పదోన్నతులు తిరిగి పొందేలా కృషి చేస్తామని, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల పదోన్నతులలో అడ్డం కి అయిన అడక్వేసి పదా న్ని రద్దు చేయించేలా కృషి చేస్తామని అన్నా రు. జిఓ నంబర్ 29 రద్దు అయ్యేంత వరకు పోరా టం చేస్తామని, జిఓ 342 ద్వారా ఎస్సి /ఎస్టీ ఉపాధ్యాయుల కు ఓడి మీద ఎంఈడీ చేసుకునే అవకాశం కల్పించేలా కృషి చేస్తా మని, రాజ్యాంగ సవర ణ 85 ద్వారా కాన్సిక్వెన్షియల్ సినియారిటీ ప్రకారం ఎస్సి/ఎస్టి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఎన్నికల కమిటీ సభ్యులు భూక్య శంకర్ నాయక్, మాలోత్ బిచ్చ నాయక్, జాదవ్ కపిల్ కుమార్, జాదవ్ చంద్రకాంత్ పర్యవేక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment