చేనేత సహకార సంఘాలలో అర్హులైన చేనేత కార్మికులకు సభ్యత్వం కల్పించాలి

చేనేత సహకార సంఘాలలో అర్హులైన చేనేత కార్మికులకు సభ్యత్వం కల్పించాలి

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 28):

 

చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కస్తూరి బిక్షపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు పద్మశాలి సంఘం అర్బన్ కాలనీ నందు చేనేత కార్మిక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాసికంటి లక్ష్మీనరసయ్య చేనేత కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మాట్లాడుతూ స్థానిక చేనేత సహకార సంఘాలలో అర్హులైన చేనేత కార్మికులకు సభ్యత్వం కల్పించాలన, త్రిఫ్ట్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, చేనేత భీమా వయోపరిమితి లేకుండా మేసే కార్మికులందరికీ వర్తించాలని, 40% సబ్సిడీని యధావిధిగా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు స్టాండ్ మగ్గాలు అర్హులైన వారందరికీ అందించాలని, వర్క్ షెడ్లను కూడా అర్హులైన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రంగు రసాయనాలు వాడే కార్మికుల కోసం రెండు లక్షల చేనేత ఆరోగ్య భీమా కార్డు అందించాలని డిమాండ్ చేశారు పైన చంపిన డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తీర్మానం చేయడం జరిగింది ఇట్టి సమావేశంలో చేనేత జిల్లా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జల్లి రాములు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆస్కాంటి లక్ష్మీనరసయ్య , చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కస్తూరి బిక్షపతి, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు అమృతం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బడుగు శంకర్, గౌరవ అధ్యక్షులు బడుగు నరసింహ, అంబాటి యాదగిరి, వేషాల అశోక్ మరియు చేనేత కార్మికులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment