ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయాలి.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారులను ఎంపిక చేసే అర్హత ప్రమాణాలు, విధానాలను అధికారులకు కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై అదనపు కలెక్టర్లు కే సీతారామారావు , దేవ సహాయం లతో కలిసి బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి గూగుల్ మెట్ ద్వారా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారులను ఎంపిక చేసే అర్హత ప్రమాణాలు,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల మార్గదర్శకాలు, ప్రభుత్వ విధానాలను కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులు,ఎంపీడీవోలు, ఆర్డీవోలు తాహసిల్దార్లకు స్పష్టంగా వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఅర్హులైన రైతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు భరోసా జాబితాలో చేర్చాలని, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన నిరుపేదలకు కేటాయించే లా జాబితా సిద్ధం చేయాలన్నారు.రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈనెల16వ తేదీ నుంచి ఈనెల 20వ తేదీ లోగా ప్రతి అధికారి క్షేత్రస్థాయిలోకి వెళ్లి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.రైతు భరోసా పథకానికి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. భూ భారతి (ధరణి) పోర్టల్‌లో నమోదు చేసుకున్న సాగు భూమి విస్తీర్ణం ఆధారంగా, పట్టా సాగుకు యోగ్యం కాని భూములను పథకానికి పరిగణించరాదాన్నారు.ఇళ్లు లేదా కాలనీలుగా మారిన అన్నిరకాల భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలకు వినియోగించే భూములు, గోడౌన్లు, మైనింగ్, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అన్ని రకాల భూములు, రాళ్లు, గుట్టలు లేని భూములు, సాగుకు అనుకూలమైన భూములను సాగుకు యోగ్యం కాని భూములుగా గుర్తించాలన్నారు.రైతు భరోసా పథకానికి సంబంధించినమార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ తెలిపారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద నమోదై 2023-24లో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలు ఈ పథకానికి అర్హులు అవుతారని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో గుర్తించిన లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామసభలో చదివి ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు.ఆహార భద్రత కార్డులురేషన్‌కార్డులు లేని కుటుంబాల జాబితాను డోర్ టు డోర్ సర్వే ద్వారా క్రోడీకరించి క్షేత్రస్థాయి పరిశీలనకు మండల స్థాయిలో మండల పరిషత్ డెవలప్‌మెంట్ అధికారి (ఎంపీడీఓ), పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహిస్తారని కలెక్టర్ తెలిపారు.గ్రామీణ ప్రాంతంలో ఒక లక్ష యాభై వేల రూపాయలు సంవత్సరానికి ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం కలిగిన వారు మాత్రమే రేషన్ కార్డు పొందేందుకు అర్హులు అవుతారని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే అధికారులు సిబ్బంది తప్పనిసరిగా ప్రభుత్వ ప్రమాణాలు మార్గదర్శకాలను అనుసరిస్తూ లబ్ధిదారుల ఎంపిక జరగాలని కలెక్టర్ ఆదేశించారు.ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు లబ్ధిదారుల సర్వేను పూర్తిచేయాలని, ఏ ఒక్క శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏ ఒక్క అధికారికి, సిబ్బందికి సెలవులు మంజూరు చేయడానికి వీలు లేదని, కలెక్టర్ అనుమతి లేనిదే ఏ ఒక్కరికి సెలవులు ఇవ్వరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.గ్రామస్థాయికి పరిశీలనకు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో లేకుంటే సస్పెన్షన్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ గూగుల్ మీట్ లో అన్ని శాఖల జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.