సమాజంలో యువత పాత్ర కీలకం,మహిళల చైతన్యంతో దేశ అభివృద్ధి
మెదక్ పట్టణ సీఐ నాగరాజు, జాతీయ సైంటిఫిక్ స్టూడెంట్స్ నరేష్
తెలంగాణ కెరటం:మెదక్ జిల్లా బ్యూరో:నవంబర్ 28:
మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో మహిళల రక్షణ, సైన్స్ మూఢనమ్మకాల అనే అంశంపై సమాజంలో యువత పాత్ర చాలా కీలకమని మహిళల చైతన్యంతో దేశం అభివృద్ధి సాధ్యమని మెదక్ పట్టణ సిఐ నాగరాజు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో మహిళల రక్షణ సైన్సు మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐ నాగరాజు, ఉప్పులేటి నరేష్ హాజరై మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని.దొంగ స్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా మోసం చేస్తున్నారని మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని డ్రగ్స్ మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ మాంత్రికులు భూత వైద్యులు మోసం చేసే కుట్రలను సైన్స్ మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులకు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు,ప్రిన్సిపాల్ భవాని, సఖి సెంటర్ ఇంచార్జ్ రేణుక, మహిళ సాధికారత కోఆర్డినేటర్ సంతోషిని, పోలీస్ సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.