పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి .

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి .

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29 .

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలనీ కోరుతూ ఆది వారం గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రీన్ వాక్ ను సూర్యాపేట జిల్లా కేంద్రం లో I నెహ్రూ నగర్ లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఇంటికి స్టిక్కర్లు, కరపత్రాల పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ప్రశ్న అధ్యక్షులు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చేతి సంచితితో బయలుదేరి సామాగ్రి కొనుగోలు చేయాలని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతోపాటు, వాతావరణ కాలుష్యానికి మొక్కలు నాటాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ కార్యవర్గం తోట కిరణ్ కుమార్

బొలిశెట్టి మధు,మారం పవిత్ర

వందనపు శ్రీదేవి, దేవరశెట్టి నాగరాజు, అనంతల సువర్ణ

యామా రజిని, దారం శ్రీనివాస్

గెల్లి అంజన్ ప్రసాద్ ,కక్కిరేణి రవిచంద్ర, మంచాల శ్యామ్

తల్లాడ రామచంద్రయ్య కొక్కుల సంపత్,రావిరాల సురేందర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment