డా .బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన మాజీ శాసన సభ్యులు…
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి డిసెంబర్
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి,వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి,రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ,అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా… రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి భువనగిరి మాజీ శాసనసభ్యులు & బిఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ ఫైళ్ళ శేఖర్ రెడ్డి మరియూ శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు యాదాద్రి భువనగిరి వినతి పత్రం సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ భువనగిరి పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.