కలెక్టర్, మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కాంకర్ క్రెసర్ రద్దు చేయాలి.
ఇచ్చిన లేటర్ ను కలెక్టర్ కి మైనింగ్ అధికారి ఆర్ ఐకి ఇచ్చిన నల్తూరు గ్రామ రైతులు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 13:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం నల్తూరు గ్రామ రైతులు కలెక్టర్, మైనింగ్ ఏడి అందుబాటు లేకపోవడం వల్ల ఆర్ ఐ ని కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇచ్చిన లేటర్ ని ఇవ్వడం జరిగింది. తేదీ 10-12-2024 రోజున ఎమ్మెల్యేని నల్తూరు గ్రామ రైతులు కలవగా ఎమ్మెల్యే కంకర్ క్రెసర్ ద్వారా నల్తూరు గ్రామ రైతులకు అన్ని రకాల ఇబంది అవుతుంది అన్ని కలెక్టర్ కి మైనింగ్ ఏడి కి ఫోన్ లో చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సూచనల మేరకు కలెక్టర్ ని, మైనింగ్ ఆర్ ఐని ఈ రోజు కలసి తక్షణమే సర్వే నెంబర్ 160 గల భూమి లో కాంకర్ క్రెసర్ కు ఉన్న అనుమతును రద్దు చేయాలనీ కలెక్టర్ ని మైనింగ్ ఆర్ ఐని కోరడం జరిగింది.