రైతు భరోసా ఎప్పుడు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

రైతు భరోసా అంతేనా..వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో

రైతు భరోసా అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు, రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపు లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే రైతు భరోసాను 7500 ఇస్తామని చేసిన వాగ్దానం ప్రకటనకే పరిమితమై నీటి మీద మూటలుగా మారింది, యాసంగి సీసన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా నేటికి రైతుల అకౌంట్లో రైతు భరోసా జమ కాక రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ఏ పథకానికి లేని అభిప్రాయ సేకరణ రైతు సంక్షేమ పథకాలకు ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట వేసే ముందు ఇవ్వాల్సిన రైతు సాయం ఇవ్వకుండా ఆగం చేస్తున్నారని రైతు భరోసా ఇవ్వకుండా కప్పిపుచ్చుకోవడం కోసం కాలయాపన చేస్తున్నారని విమర్శలు రైతుల నుండి, సర్వత్ర రైతు సంఘం నాయకుల నుండి, వినవస్తున్నాయి కొంతమంది నాయకుల పొంతనలేని ప్రకటనలు చేయడంతో అసలు వస్తాయా రావా అని సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సేద్యం చేసే భూమికి ఇస్తామని ఒకసారి, 10 ఎకరాలు వరకేనని ఒకసారి, ఐదు ఎకరాల అని ఒకసారి చేస్తున్న ప్రకటనలతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధప్రాద పదికన రైతు సహాయం అకౌంట్లో జమ మ చేసి వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి రైతులను కాపాడాలని రైతులు రైతు సంఘం నాయకులు రైతు భరోసా అందేనా లేదా ప్రభుత్వం అందిస్తే ఎప్పుడు ఇస్తారు త్వరగా అందించాలని కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment