గాగిల్లాపూర్ గ్రామంలో అధికారుల క్షేత్ర స్థాయి తనిఖీ
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి 16 :
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో అధికారులు గురువారం క్షేత్ర స్థాయి తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నూతన రేషన్ కార్డుల మంజూరి కోసం, రైతు భరోసా కు సంబంధించిన అంశాల పై అధికారులు సర్వే జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంపీవో మంజుల, మండల వ్యవసాయ అధికారి సంతోష్, పంచాయితీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.