ఫైల్ నేమ్ : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఎఫెక్ట్ కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు బదిలీ
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్
కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీ ఉత్తర్వులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నా కామారెడ్డి డిఎస్పీగా నాగేశ్వర్ రావు బాధ్యతలు చేపట్టారు. 10 నెలల పాటు ఆయన ఇక్కడ విధులు నిర్వర్తించారు. అయితే విధి నిర్వహణలో డిఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల బిక్కనూర్ మండలంలో ఫోక్సో కేసులో విచారణ అధికారిగా కామారెడ్డి డిఎస్పీని కాకుండా ఎల్లారెడ్డి డిఎస్పీకి అప్పగించారని ప్రచారం సాగింది. వీటితో పాటు డిఎస్పీ మాట తీరు కూడా సరిగా ఉండదని తెలుస్తోంది. ఇటీవల ఓ జర్నలిస్టు పట్ల దురుసుగా మాట్లాడిన విషయంపై తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్, ఎన్ యు నెంబర్ (I) జిల్లా నాయకులు అధ్యక్షుడు వేణు జిల్లా అడిషనల్ ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం కూడా డిఎస్పీ బదిలీకి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం డిఎస్పీని జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనేది ఇంకా తెలియరాలేదు. అయితే అడిషనల్ ఎస్పీగా కొత్తగా వచ్చిన చైతన్య రెడ్డి కామారెడ్డి డిఎస్పీగా వ్యవహరించనున్నట్టు సమాచారం.