---Advertisement---

నిరుపేద కుటుంబ ఇల్లు నిర్మాణానికి ఆర్ధిక సహాయం

---Advertisement---

 

-శివారు వెంకటాపూర్ గ్రామస్తులకు ఎల్లవేళలా అండగా ఉంటా

-బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 13,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివార్ వెంకటపూర్ గ్రామానికి చెందిన చిగురుపల్లి బాబు నూతన భవనం నిర్మించుకుంటున్నాడు.తాను నిర్మించుకునే నూతన భవన నిర్మాణానికి సహాయం కావాలని తుమ్మల కనకయ్య ముదిరాజ్ ను కోరగా,అడిగిన వెంటనే స్పందించి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య ముదిరాజ్ చిగురుపల్లి బాబుకు తన వంతు సహాయంగా గృహ నిర్మాణానికి 40 బస్తాల సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా తుమ్మల కనకయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని,గ్రామ ప్రజలకు ప్రతి విషయంలో అండగా ఉంటానని అన్నారు.అడిగిన వెంటనే తుమ్మల కనకయ్య ముదిరాజ్ అండగా నిలువడంతో చిగురుపల్లి బాబు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి,కృతజ్ఞతలు తెలిపారు.వారితో పాటు పుట్ట సత్యనారాయణ,బచ్చల జహంగీర్,కొరివి మాదారి,కొరివి చందు,గుర్రాల మహేందర్,రసాల ఎర్రయ్య,పుట్ట ప్రసాద్,గుర్రాల రాజు,గడ్డం శంకర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment