మృతిని కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 11):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన వెంకటేష్ హైదరాబాదులోని చక్రగిరి ట్రాన్స్పోర్ట్ లో డ్రైవర్గా పనిచేస్తూ గత పదిరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి మిత్రులైన డ్రైవర్లు శనివారం ఆయన దశదినకర్మకు హాజరై. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి చక్రగిరి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు అందరు స్పందించి వాళ్లకు తోచిన సాయంగా 33,000 వేలు భార్యా పిల్లలకు కుటుంబానికి ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాత్కసైదులు యాదవ్, వావిళ్ళ తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.