అప్పుల బాధతో మృతి చెందిన బాధ్యత కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం.
లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్. మోహన్ నాయక్ అందజేత.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:
మెదక్ జిల్లా నిజాంపేట్ మండల్ చల్మెడ గ్రామంలో చేత్రి శ్రీశైలం అప్పుల బాధతో గత కొద్ది రోజుల క్రితం చనిపోయారు ఇట్టి విషయాన్ని లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్.మోహన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి వారి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, తాజా మాజీ ఉపసర్పంచ్ తుమ్మల రమేష్, తిరుమల స్వామి గుడి చైర్మన్ అక్కపల్లి రామ్ రెడ్డి, రమావత్ రాజు, మాలావత్ బాబు, డైరెక్టర్ బాజా రమేష్, కాంగ్రెస్ నాయకుడు అక్కపల్లి అబ్బారెడ్డి, నంద్యాల యాదవ రెడ్డి, బాజా నాగరాజు, గడ్డమీది మల్లేష్,రాములు, బీరయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.