నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం.
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి 28 .సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో రామస్వామి గట్టు వద్ద పెయింటర్ గా జీవనం కొనసాగిస్తూన్న పెయింటర్ హరిబాబు అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోవడంతో, ఐదు సంవత్సరాల బాబు తో హరిబాబు భార్య మాధవిల పరిస్థితి అగమ్య గోచరంగా, దిక్కుతోచని స్థితిలో ఉండగా హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి తక్షణమే స్పందించి వారి కుటుంబానికి 50 కేజీ ల బియ్యం ₹2,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. వారి కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతు చేతనైన సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో 25 వార్డ్ కంటెస్టెడ్ కౌన్సిలర్ సులువ చంద్ర శేఖర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రెడపంగు రాము, మూడో వార్డ్ బూత్ అధ్యక్షుడు యువజన నాయకులు కస్తల రవీందర్ , దగ్గుబాటి బాబురావు కస్థాల సైదులు,పార సాయి పిల్లి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.