కొండపోచమ్మ ప్రాజెక్ట్ లో పడి ఐదు మంది యువకులు మృతి

కొండపోచమ్మ ప్రాజెక్ట్ లో పడి ఐదు మంది యువకులు మృతి

 

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన 

 

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

 

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి

 

గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి

 

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 11,

సిద్దిపేట జిల్లా మర్కుక్,ములుగు మండల సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ లో శనివారం రోజున హైదరాబాదు లోని ముషీరాబాద్ కు చెందిన ఏడు మంది యువకులు కొమురవెల్లి కి వెళ్లి దర్శనం చేసుకొని,తిరిగి హైదరాబాదుకు వెళ్లే దారిలో కొండపోచమ్మ ప్రాజెక్టు ఉండడంతో అక్కడికి వెళ్లి పోటోలు తీసుకుంటూ ప్రాజెక్ట్ లో కాలు జారి పడి ఐదు మంది యువకులు చనిపోవడం జరిగింది.ఐదు మంది ఒకేసారి మృతి చెందడం పట్ల గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి,రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,నాయకులు ఎలక్షన్ రెడ్డి,గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబ సభ్యులను వారు పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం తూంకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు జలాశయాల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వారు అన్నారు.మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొండపోచమ్మ ప్రాజెక్ట్ చుట్టూ సీసీ కెమెరాలు,లైట్స్ ఉండేవని,ప్రాజెక్ట్ లోపల పెట్రోలింగ్ చేయడానికి ఒక ప్రత్యేక టీమ్ ఉండేదని,ఇపుడు ఉన్న ప్రభుత్వం కనీసం కొండపోచమ్మ ప్రాజెక్ట్ ను పట్టించుకోవడం లేదని అన్నారు.మరణించిన ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు అందించాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేషం గౌడ్,మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్,మర్కుక్ మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment