హైదరాబాద్ మాజీ మేయర్ కోరివి కృష్ణ స్వామి ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా జండా ఆవిష్కరణ
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 21):
ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తా నందు ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది . తదుపరి కూర వెంకటేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కొరివి కృష్ణస్వామి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అని ,మంచి రచయిత అని ,1933 నుంచి 25 సంవత్సరాల పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థలో చుడీ బజార్ ప్రాంతానికి మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1940, 1955 లలో డిప్యూటీ మేయర్ (నాయబ్ మీర్ మజ్లిస్) గా, 1957 నుండి 1958 వరకు హైదరాబాదు నాలుగో మేయరుగా సేవలు అందించారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలుపుల పెద్ద కృష్ణ ,ఉడుత భాస్కర్ ,కొలుపుల నాగరాజు,బిస్కుంట్ల జహంగీర్ ,కూర గోపాల్ ,బండి సూరి ,బరిగే శంకర్ మరియు ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు