విద్యార్థిని విద్యార్థులకు.
నాణ్యమైన భోజనంను అందించడమే ప్రభుత్వ లక్ష్యం
– ఏడుపాయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
– ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన మెస్ ఛార్జీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
– విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధించాలి
– నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 14:
విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు పౌష్టికాహారం ను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు చేసింది నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం మెదక్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో మెస్ చార్జీల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం డైట్ మెనూ చాట్ ఆవిష్కరించి విద్యార్థినులతో కలిసి భోజనం చేసారు. కాగా మొదటగా ఏడుపాయల వనదుర్గభవాని అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలోనే ఏడుపాయల అభివృద్ధిపై ప్రత్యేక నిధులు రానున్నట్లు ఆయన పేర్కోన్నారు.