మెదక్ లో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు.
రేవంత్ రెడ్డి కి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ, ప్రజల సమస్యలు ముఖ్యం కావా?.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 23:
20 వేల సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద పడితే ఎందుకు పట్టించుకోవు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చాయ్ తగినంత సమయంలో సమస్యలు పరిష్కరిస్తా అని మాట తప్పారు.
డిసెంబర్ 9 నుండి సమ్మె చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు.
అసెంబ్లీలో నిలదీసినా స్పందన లేదు.అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి,మంత్రులు మోసం చేశారు.ఎంత మంది మాట్లాడినా చలనం లేకుండా ఉన్నారు.
విద్యా శాఖకు మంత్రి లేడు. బడ్జెట్ లో 15 శాతం నిధులు అని, 7 శాతం కూడా పెట్టలేదు.
ఒకటో తారీఖు జీతాలు అని నరుకుతున్నడు తప్ప, చేతల్లో ఏం లేదు.నిరసన చేయడం వల్ల లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది.గ్రీన్ ఛానెల్ నిధులు అనేది వట్టి మాటలే
సస్పెండ్ చేయాల్సింది వార్డెన్లు, ప్రిన్సిపాల్ కాదు. రేవంత్ రెడ్డిని చేయాలి.ఉన్న పథకాలు ఇవ్వరు, కొత్త పథకాలు లేవు. పింఛన్లు పెంచుతామని మోసం చేశారు.
వృద్యాప్య పింఛన్లు రెండు నెలలు ఎగ్గొట్టిండు.బడా కాంట్రాక్టర్లు పెర్సెంటెజ్ తీస్కొని బిల్లులు ఇస్తున్నాడు. మాజీ సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదు.ప్రశ్నిస్తే ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు.రేవంత్ ఇచ్చిన హామీ అమలు చేసేదాకా నిరంతరం మీకు బి ఆర్ ఎస్ అండగా ఉంటాం సమస్య పరిష్కారం అయ్యేదాకా కొట్లడుతం.మీ సమస్యల పట్ల ప్రభుత్వానికి త్వరలో డెలిగేషన్ ఇస్తాం.
25 వ తేదీ వస్తున్న రేవంత్ కు చీము నెత్తురు ఉంటే ఈ రోడ్డు ముందు నుండే పోతాడు. వీరి వద్దకు,ఈ టెంట్ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నాం.
మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టీ రుణమాఫీ మాట తప్పిండు.
మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు సహకారం ఉంటది.
అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పాను. ప్రభుత్వాన్ని నిలదీశాను.ముల్లును ముళ్ళు తోనే తీయాలి అన్నట్లు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి. రేవంత్ ను నిలదీయండి.