దొంగ మల్లన్న స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 22
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో దొంగ మల్లన్న స్వామి ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి, భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పార్టీ అధ్యక్షులు గోస్కుల జలందర్, వైఎస్ ఎంపిపి ఆవుల సత్యం, మాజీ ఎంపీటీసీ గోస్కుల రాజన్న, మాజీ సర్పంచ్ సిద్దంకి నర్సయ్య, మల్లారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంపల్లి అనుమాండ్లు, పిఎసిఎస్ చైర్మన్ వెంకట మాధవరావు, బిఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి విజయ్, బి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షుడు అవారి చందు, మాజీ ఎంపీటీసీ భీమా సత్తన్న, బాలబత్తుల కిషన్, మల్లారెడ్డి, రమేష్, రవిధర్, సల్లూరి శోభన్ గౌడ్ బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.