రైతు భరోస పై మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది అని సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాట తప్పింది అని గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారు మండిపడ్డా.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుని జనవరి 26 రోజున రైతులందరికీ రైతు భరోసా కింద 15,000 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్ రావు పటేల్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు నవాబు,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పరశురాం, కౌన్సిలర్ విఠల్,పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్,ఉపాధ్యక్షుడు నరసింహులు యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు యాదుల,మాజీ సర్పంచులు సంగప్ప, మాణిక్ రెడ్డి, రాజు,సల్మాన్, మల్గొండ తదితరులు ఉన్నారు.