తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి 28 నవంబర్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన రాములు గారికి 13,500, కాశమ్మ గారికి 13,500 మరియు మహమ్మద్ మజీద్ గారికి 11,000 రూపాయల వారి ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మండల తాజా మాజీ జడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ చారి, మాజీ సర్పంచ్ రాజు, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్, బీసీ సంఘం తాలూకా యువత అధ్యక్షులు దత్తు కురుమ, నాయకులు ప్రవీణ్ రెడ్డి, మక్బూల్, దస్తగిరి,రాములు,పండరి రమేష్, రాజు, కృష్ణ తదితరులు ఉన్నారు.