జి స్టోర్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 27:
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శుక్రవారం జీ స్టోర్ ను ప్రారంభోత్సవం చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో జీ స్టోర్ సూపర్ మార్కెట్ ను శుక్రవారం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సూపర్ మార్కెట్లో అయన కొబ్బరికాయ కోట్టి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.తదనంతరం జీ స్టోర్ యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.