మానవత్వం చాటుకున్న మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు

మానవత్వం చాటుకున్న మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి

మాచారెడ్డి నుండి కామారెడ్డికి వెళుతున్న మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు కామారెడ్డి మండలం, ఉగ్రవాయి గ్రామ రహదారి పైన, గుర్తు తెలియని వాహనం బైకు ని ఢీకొని, ప్రమాదంలో గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని చూసి, తన కారు ఆపి దిగి గాయాలతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి రప్పించి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా డాక్టర్‌కు ఫోన్‌ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు ఆపదలో చూపిన చొరవకు అక్కడున్న స్థానికులు అభినందనలు తెలిపారు. నర్సింగ్ రావు వెంట మాజీ వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి కౌన్సిలర్ రామ్మోహన్, సాయికుమార్ గౌడ్ ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment