*సిద్దిపేట మున్సిపాలిటీకి నాలుగు అవార్డులు*
* 24 రాష్ట్రాల నుండి 100 మంది అధికారులకు ఆహ్వానం*
* సిద్దిపేట నుండి ప్యానల్ డిస్కర్షన్ మెంబర్గా కమిషనర్ కుఆహ్వానం
* చేంజ్ మేకర్స్ సదస్సులో పాల్గొన్న మునిసిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్*
తెలంగాణ కెరటంసిద్దిపేట జిల్లా ప్రతినిధి
న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్మెంట్ వారు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి సహకారంతో చేంజ్ మేకర్స్ కాంక్లేవ్ సదస్సు జరగనుందని అందులో పాల్గొనుటకు ఉత్తమ పనులు (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) నిర్వహించినటువంటి 24 రాష్ట్రాల నుండి 100 మంది అధికారులకు ఆహ్వానం రాగా అందులో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ గారికి ప్యానల్ డిస్కర్షన్ మెంబర్ గా ఆహ్వానం అందడం జరిగింది.జాతీయ స్థాయి మార్పు తయారీదారుల సదస్సులో పాల్గొన్న కమిషనర్ అశ్రిత్ కుమార్
మున్సిపల్ కమిషనర్ సదస్సులో మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో చెత్త సేకరణ 100% జనానికి ముఖ్య కారణంమని ప్రతిరోజు వార్డులలో మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రతిరోజు నిత్యం తమ ఇంట్లో వెలుపడే చెత్తను తడి,పొడి,హానికర చెత్తగా వేరు చేయు విధానాన్ని అవగాహన కల్పించామని ఏ రకమైన చెత్తను తడి,పొడి,హానికర చెత్తగా వేరు చేయాలో మొదటగా వారికి తెలపడం జరిగిందని అంతేకాకుండా వారంలో మంగళవారం శుక్రవారం పొడి చెత్తను అందజేయడం మిగతా రోజులలో తడి చెత్తను మున్సిపల్ వాహనానికి అందజేయాలని అవగాహన కల్పించడం జరిగిందని వారి గృహాల వద్దకు వెళ్లిన సమయంలో చెత్త డబ్బాలలోని చెత్తను వారి ముందే తడి,పొడి,హానికర చెత్తగా వేరు చేసి మరీ అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
పట్టణంలోని 42,000 మందికి స్వచ్ఛ బడి ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించే అవగాహన కల్పించడం జరిగిందని మరియు ఇంట్లో వెలువబడేటటువంటి తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ విధానాన్ని సిద్దిపేట పట్టణంలోని స్వచ్ఛబడి ద్వారా సేంద్రియ ఎరువు తయారీ విధానాన్ని మహిళలకు మరియు పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు త్వరితగదన అర్థమయ్యే విధంగా ప్రొజెక్టర్ ద్వారా వివరించడమే కాకుండా స్వచ్ఛ బడిలో ఉన్నటువంటి సేంద్రియ ఎరువు కేంద్రంలో 42 రోజులపాటు ఎరువు ఎలా తయారవుతుందో వారికి ప్రతిరోజు వార్డులో కొంతమంది మహిళలను స్వచ్ఛ బడికి ఆహ్వానించి అవగాహన కల్పించి వారి ఇళ్లల్లోనే సేంద్రియ ఎరువు తయారు చేసుకొనేల ప్రోత్సహించడం జరిగిందన్నారు.ఇటీవల అక్టోబర్ నెలలో సిద్దిపేట పట్టణానికి 4 రోజుల పాటు 44 పురపాలక సంఘాల కమిషనర్లు అధికారులు సిద్దిపేట పట్టణాన్ని సందర్శించి కొన్ని వార్డులలో పర్యటిస్తూ ఇళ్లల్లో వెలువడి చెత్తను ఏ విధంగా వేరు చేస్తున్నారు అని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. పట్టణంలో 3500 హోమ్ కంపోస్టింగ్ యూనిట్స్ ఉన్నాయన్నారు.
అంతేకాకుండా పట్టణంలో రహదారుల వెంబడి వ్యర్ధాలను సేకరించే వారిని గుర్తించి పట్టణంలో రహదారుల వెంబడి, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నటువంటి పొడి చెత్తను వారి ద్వారా సేకరించి సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయంలో భాగమైన డి ఆర్ సి సి (పొడి చెత్త సేకరణ కేంద్రం) కి తరలించి వారికి ఉపాధి కల్పించడం ద్వారా పట్టణంలో బహిరంగ ప్రాంతాలకు పొడి చెత్తను నిర్మూలించగలిగామన్నారు. సిద్దిపేట పట్టణ ప్రజాప్రతినిధులు, మెప్మా మరి మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజల సహకారంతో సత్య సిద్దిపేట దిశగా అడుగులు వేయగలిగామన్నారు.
సిద్దిపేట పట్టణంలో 4 అవార్డులను పొందగా చేంజ్ మేకర్- 2022 లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను చేంజ్ మేకర్ కాంక్లేవ్ అవార్డును కమిషనర్ అశ్రిత్ కుమార్ మరియు వనిత (సానిటరీ ఇన్స్పెక్టర్) న్యూఢిల్లీలో అవార్డును స్వీకరించటం జరిగింది.