చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో 54 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు 

చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో 54 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రం నుండి కోరుట్ల ప్రెస్ క్లబ్, లయన్స్ క్లబ్ విజన్ కేర్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నుండి కరీంనగర్ చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో 54 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు విజయవంతమయినట్లు లయన్స్ క్లబ్ విజన్ కేర్ ఉపాధ్యక్షులు, నేత్రవైద్య నిపుణులు, మా ఐ కేర్ నిర్వాహకులు లయన్ ముబీన్ తెలిపారు. వీరందరకి ఉచిత రవాణా, భోజన వసతులు కల్పించి శుక్రవారం కోరుట్లకు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ డా.అనూప్ రావు, నేత్రవైద్య నిపుణులు పూదరి దత్తాగౌడ్, డా.అనురాగ్ పవార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, మొహమ్మద్ అహ్మద్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment