ఆర్.టి.ఐ సమాచార హక్కు చట్టం-2005 పైన ఉచిత శిక్షణ శిబిరం
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 3:
సమాచార హక్కు చట్టం 2005 పైన ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించిన రాష్ట్ర డైరెక్టర్ సలీం…కామారెడ్డి పట్టణంలోని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రాంతీయ కార్యాలయం విద్యానగర్ కాలనీ కామారెడ్డిలో సమాచార హక్కు చట్టం 2005 పైన ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ సలీం తెలిపారు.ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలై దాదాపు20 సంవత్సరాలు పూర్తవుతున్న కూడా ప్రజలలో ఈ చట్టంపై అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు, అలాగే చాలా వరకు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు సమాచార హక్కు చట్టం 2005 పైన పూర్తిగా అగ అవగాహన లేకపోవడం చాలా సిగ్గుచేటు అని అన్నారు.గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పూర్తిగా అణగదొక్కినది ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కి డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా న్యాయవాది మరియు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ మహిళ అధ్యక్షురాలు కుమారి షబానా బేగం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం దరఖాస్తు విధానం సెక్షన్ 6(1) మరియు మొదటి ఆపిల్ సెక్షన్ 19(1), రెండవ ఆపిల్ సెక్షన్ 19 (3) అలాగే సమాచారాన్ని ఇవ్వని అధికారులకు సెక్షన్ 18 (1)రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసినచో ప్రతిరోజు 250 రూపాయల చొప్పున 25 వేల వరకు సంబందిత అధికారికి జరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్కు ఉంటుందని గుర్తు చేశారు.ఇట్టి శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ జోనల్ అధ్యక్షులు సిర్నాపల్లి ప్రదీప్ కుమార్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శివపూజ లింబయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్ జిల్లా ప్రతినిధులు మొహమ్మద్ అన్వర్ గౌరీ ఇక శ్రీనివాస్ చాకలి లింగం కామారెడ్డి జిల్లా మహిళా కార్యదర్శి ఎస్ జమున, జరీనా నౌ సీన్, సఫియా, రాబియా బేగం తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఎం ఏ సలీం
రాష్ట్ర డైరెక్టర్
సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్రం.