మోర్తాడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా పూర్తిస్థాయి వైద్యులను నియమించాలి
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 15 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రం లో జిల్లాలో ఎక్కడ లేని విధంగా మోర్తాడ్
గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గతంలో ఆస్పత్రి నిర్మాణానికి, ఉచితంగానేప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం అందించడం జరిగిందని, ఆస్పత్రి నిర్మాణం ప్రయత్నం జిల్లాలో ఎక్కడ లేని విధంగా నిర్మించడం జరిగిందని, విశాలమైన ప్రదేశంలో ఆస్పత్రి నిర్మించడం, వచ్చే రోగులకు సైతం విశాలమైన ప్రదేశాలు గదులు ఉన్నాయని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ అశోక్ అన్నారు. శనివారం రోజునమోర్తాడ్ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్ సందర్శించడం జరిగింది.
రెగ్యులర్ డాక్టర్ డెంటల్ ప్రవీణ్, డాక్టర్ సునీత,
డాక్టర్ స్నేహ, పద్మ సిస్టర్, ఫార్మసిస్ట్ సంజీవ్, నిర్వహించే వైద్య సిబ్బంది, ఇతరత్రా వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
అలాగే మోర్తాడ్ మండల ప్రజలు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ లను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు, రోగులకు చిత్తశుద్ధితో మరింత సేవ చేసి మోర్తాడ్ ప్రభుత్వ ఆస్పత్రిని, ప్రైవేట్ ఆస్పత్రులను మైమార్పించే విధంగా రోగులకు వైద్య చికిత్సలు అందించాలని ఆయన జక్కం అశోక్,వైద్యులకు,వైద్య సిబ్బందికి సూచించారు. మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా నార్మల్ డెలివరీ కేసులను చేయాలని డాక్టర్లను వివరిస్తూ కోరారు.
అలాగే నిన్న డెలివరీ కేసులు రెండు జరగడం జరిగాయని, పోచమ్మ గల్లికి చెందిన రేఖ కు అమ్మాయి, ముబీనా కు కొడుకు నార్మల్ డెలివరీ గా ప్రసవాలు చేసినట్లు వైద్యులు తెలిపినట్లు ఆయన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి,మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలోనేప్రసవాలతో పాటు,అన్ని వైద్య చికిత్సలు నిర్వహించేలా స్కానింగ్ సెంటర్ కు సంబంధించిన పరికరాలు, ప్రసవాలు నిర్వహించే వైద్యులను, నియమింప చేయాలని బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు.