*తొలి ఏడాదిలో నా 750 కోట్ల రూపాయలతో మెదక్ నియోజక వర్గానికి నిధులు*

*తొలి ఏడాదిలో నా 750 కోట్ల రూపాయలతో మెదక్ నియోజక వర్గానికి నిధులు*

– ముఖ్యమంత్రి హోదాలో ఏడుపాయలకు రావడం ఇదే తొలిసారి
– గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజక వర్గాన్నికి తీరని అన్యాయం
– మొసలికన్నీరుకార్చి నియోజక వర్గ ప్రజలను మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీయే
– మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ రావు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:

తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే మెదక్ నియజక వర్గానికి 750 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగిందని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్.మైనంపల్లి రోహిత్ రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కోన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మెదక్ నియోజక వర్గంలోని ఏడుపాయల దుర్గమ్మ దేవాలయాని దర్శించుకోవడం చరిత్రలో మొదటిసారి అని ఆయన గుర్తుచేశారు.గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నియోజక వర్గానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. అంతే కాకుండా మెదక్ జిల్లాలో గత బిఆర్ఎస్ ప్రభత్వ పాలనలో నియోజక వర్గ ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదని ఆయ విమర్శించారు. అంతే కాకుండా గత ప్రభుత్వంలో మొసలికన్నీరు కార్చి ఇక్కడి ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆయన గుర్తుచేశారు.
పాపన్నపేట మండలంకు 35 కోట్లు మంజూరు…! మెదక్ నియోజక వర్గంలోని పాపన్నపేట మండలంకు డివైడర్ లు మరియు బటర్ ప్లై లైట్స్ తో పాటు ఏడుపాయల్లో రూప్ ఏర్పాటుకు ప్రభుత్వం జి.ఓ. నెం. 810, తేది. 24.12.2024 నాడు 35 కోట్ల రూపాయలు పంచాయితీ రాజ్ శాఖ కు నిధులు విడుదల అయ్యాయని నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్ .మైనంపల్లి రోహిత్ ఒక ప్రకటనలో పేర్కోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment