---Advertisement---

కలెక్టరేట్ కార్యాలయం లో అధికారికంగా జి.వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

---Advertisement---

కలెక్టరేట్ కార్యాలయం లో అధికారికంగా జి.వెంకటస్వామి వర్ధంతి వేడుకల

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి డిసెంబర్ 22.

 జిల్లా లో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ హాలు లో ఆదివారం అధికారికంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు_.

జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థ లు) సుధీర్, సాంఘీక సంక్షేమ అధికారి మల్లేశం, డివై. ఎస్ ఓ హనుమంతు రావు,తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత,బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని,ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు.
స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.వర్ధంతి కార్యక్రమంలో షెడ్యుల్డ్ కులాల అభివృధి అధికారి మల్లేశం,హనుమంత రావు,శుక్రవర్ధన్ రెడ్డి,హాస్టల్ వార్డెన్లు,వివిధ శాఖల అధికారులు,కలెక్టరేట్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment