చదువుతోపాటు ఆటపాటలు ఎంతో ముఖ్యం…
మనం సాధించిన విజయం రేపటి నాంది కావాలి…
డాన్ బాస్కో పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే సునీత రెడ్డి
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో నర్సాపూర్ న్యూస్ (మార్చ్ 08):విద్యార్థులకు చదువులతోపాటు ఆట పాటలు ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నర్సాపూర్ పట్టణంలోని డాన్ బాస్కో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించగా ఎమ్మెల్యే సునీత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు టెక్నాలజీ ఎంతో ముఖ్యమని, అధిక టెక్నాలజీని ఉపయోగించుకోకుండా తమకు అవసరమైన టెక్నాలజీని మాత్రమే నేర్చుకోవాలని అన్నారు. విద్యార్థుల చదువు బాధ్యత కేవలం ఉపాధ్యాయులదే కాదని తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుల పట్ల బాధ్యత తీసుకోవాలన్నారు. అదే విధంగా పాఠశాలలో మంచిగా చదివే విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు డీజే పాటల మధ్య నిర్వహించిన డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నాహీముద్దీన్, డాన్ బాస్కో పాఠశాల చైర్మన్ యస్వంత్ రెడ్డి, డైరెక్టర్ నర్సిరెడ్డి, ప్రిన్సిపాల్ మేఘన, నాయకులు పంబల బిక్షపతి, రామ్ చందర్, జ్ఞానేశ్వర్, రాకేష్ గౌడ్ తదితరు పాల్గొన్నారు.