నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా గంగాపురం రాజేందర్ ప్రమాణ స్వీకారం.

నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా గంగాపురం రాజేందర్ ప్రమాణ స్వీకారం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయం చైర్మన్గా అచ్చంపేట పట్టణానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమం ఉద్యమకారుడు గంగాపురం రాజేందర్ నాగర్ కర్నూలు జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహచర ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. మంత్రి జూపల్లి ఎమ్మెల్యేల సమక్షంలో గంగాపురం రాజేందర్ గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం పలువురు నేతలు ఐ ఎన్ టి యు సి నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి గంగాపురం రాజేందర్ ను శాలువాతో పూలమాలలు వేసి సత్కరించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గ్రంధాలయ చైర్మన్ ప్రమాణస్వీకారం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment