మాలలు సింహ గర్జనకు అధిక సంఖ్యలో తరలిరండి.
మాల మహానాడు రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 29):
డిసెంబర్ 1 తేది న హైద్రాబాద్ సికింద్రా బాద్ పెరేడ్ గ్రౌండ్లో ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే మాలల సింహ గర్జన కు అచ్చంపేట నియోజకవర్గం నుండి మాలలు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. అచ్చంపేట మండలంలో చందా పూర్ వివిధ గ్రామాల లో పర్యటిస్తూ మాలలు అంత ఐక్యంగా ఉండి హక్కులు సాధించు కోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నేతలు ఎనూ పోతుల అనిల్ , బిజ్జులరవీందర్ , ప్రభాకర్ , అభి శ్రీను, శివ శంకర్, లక్ష్మణ్, విష్ణు,తదితరులు పాల్గొన్నారు.