గంగుల రణధీర్ దంపతులకు గర్రెపెల్లి మహేశ్వర శర్మ ఆశీర్వచనం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 14 : కోరుట్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు గంగుల రణధీర్ జయలక్ష్మి దంపతులకు పౌరాణికప్రవర, ప్రవచన చక్రవర్తి శ్రీ శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డా.గర్రెపల్లి మహేశ్వరశర్మ ఆశీర్వచనం అందజేశారు. కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో జరుగుతున్న శ్రీ మార్కండేయ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న రణధీర్ జయలక్ష్మి దంపతులకు గర్రెపెల్లి మహేశ్వర శర్మ ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేశారు.