---Advertisement---

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి

---Advertisement---

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతినెల ఆసరా పెన్షన్లు సకాలంలో రాక తాము బిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపరిచిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి నవంబర్ నెల పూర్తి అయినా నేటికీ సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిరసిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నియోజకవర్గం వికారాబాద్ లోని రైల్వే జంక్షన్ లో సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో బిక్షాటన చేసి రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఆగ్రహం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపే ఆసరా పింఛన్లు పంపిణీ చేయడంతోపాటు రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వివిధ రకాల పెన్షన్ దారులకు పెన్షన్లు మంజూరు చేయాలని లేకుంటే త్వరలోనే తమ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతినెల ఆసరా పెన్షన్లు సకాలంలో రాక తాము బిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపరిచిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు శనివారం తెలంగాణ రాష్ట్ర శాసన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నియోజకవర్గం వికారాబాద్ లోని రైల్వే జంక్షన్ లో నవంబర్ నెల పూర్తి అయినా నేటికీ రాష్ట్రంలో సకాలంలో ఆసరా పెన్షన్లు పంపిణీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన తీరును నిరసిస్తూ సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో బిక్షాటన చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ భిక్షాటన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతినెల ఆసరా పింఛన్లు సకాలంలో రాక ఆసరా పింఛనే జీవనాధారంగా జీవనం వెల్లదీస్తున్న వృద్ధులు వితంతువులు వికలాంగులు గీత కార్మికులు బీడీ కార్మికులు పైలేరియా బాధితులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని ముఖ్యంగా వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతు వివిధ రకాల మందులు వాడుతూ కాలం వెల్లదీస్తున్న వృద్ధులకు నేటికీ ఆసరా పెన్షన్ అందకపోవడంతో కనీసం తమకు అవసరమైన మందులు కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన రాష్ట్రంలో పింఛన్దారుల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మీ నియోజకవర్గ కేంద్రంగా తాము చేసిన బిక్షటన కార్యక్రమాన్ని చూసైనా పెన్షన్లు సకాలంలో రాక తాము పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రంలో ప్రతినెల 1వ తేదీ నుంచి ఐదో తేదీలో ఆసరా పింఛన్లు పంపిణీ చేసేలా కృషి చేయాలని వికారాబాద్ శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ గారైన గడ్డం ప్రసాద్ గారిని తమ సంఘం పక్షాన కోరుతున్నట్లు తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వచ్చే నెల నుంచి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి నుంచి ఐదులోపే ఆసరా పింఛన్లు అందించేందుకు కృషి చేయడంతోపాటు రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వివిధ రకాల పింఛన్దారులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని లేకుంటే లక్షలాదిమంది వికలాంగులతో త్వరలోనే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ బిక్షాటన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ సంఘం జిల్లా నాయకులు రవీందర్ సంఘం దారూర్ మండల అధ్యక్షుడు బాలరాజు సంఘం వికారాబాద్ టౌన్ అధ్యక్షులు గణేష్ పరిగి మండల అధ్యక్షులు చంద్రయ్య దోమ మండల అధ్యక్షుడు సుక్కయ్య అనిల్ నరసింహులు నారాయణ నరేష్ జంగయ్య రాజు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment