బాలికలు, మహిళలు సావిత్రిబాయి పూలే ఆశయ బాటలో నడవాలి.

బాలికలు, మహిళలు సావిత్రిబాయి పూలే ఆశయ బాటలో నడవాలి.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మరియు ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి

ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే,
194వ జయంతి,
జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,మహిళ విద్యాప్రదాతకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సావిత్రిబాయి పూలే కు నిజమైన నివాళి,
నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అధికారికంగా నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ మహానీయురాలి చిత్రపటానికి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, పుష్పాంజలి ఘటించారు.
సావిత్రిబాయి ఫూలే 194వ జయంతి సంధర్భంగా, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషిచేసిన సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెకిచ్చిన ఘనమైన నివాళి అని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అంద‌రికీ ఆదర్శం అన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమ‌ని పేర్కొన్నారు. మహిళలకు విద్య అందకుండా చేసిన కట్టుబాట్లను చేధిస్తూ 1848 లో దేశంలోనే మొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి, తదానంతరం 52 పాఠశాలలకు విస్తరింపజేసిన ఘనత ఆమెదేనన్నారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సమష్టిగా పోరాటం చేసినట్లు, వితంతువులకు శిరోముండనం చేయడాన్ని వ్యతిరేకించి, ఉద్యమం నడిపి విజయం సాంధించిన ధీరవనిత అని కలెక్టర్ తెలిపారు. భర్త జ్యోతిబా ఫూలే ప్రోత్సాహంతో స్వయంగా చదువుకున్న సావిత్రీబాయి దేశంలో మహిళా విద్యకు మూలం అయిందని ఆనాడు ఆమె చేసిన ధైర్య సాహసానికి నేడు ఎంతో మంది మహిళలు ఉన్నత రంగాలల్లో రాణించి ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్క మహిళా ఆమె ఆశయాలకు అనుగుణంగా రాణించాలని కలెక్టర్ సూచించారు.
నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి ఆశయాల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతి జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. సావిత్రిబాయి ఫూలే ఆశయాల సాధనకు తమ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని ఆర్పించారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు.సావిత్రీబాయి ఆశయాల సాధనకు మహిళా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని,ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వీలుగా వారిలో నైపుణ్యాల వృద్ధిలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ…. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈరోజు కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించి పలువురు మహిళా ఉపాధ్యాయులను సన్మానం చేసుకోవడం ఆమెకి ఇచ్చే నిజమైన గౌరవంగా భావించి భావితరాల బాలికల భవిష్యత్తుకు మహిళా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో ఈ సందర్భంగా కోరారు.
అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈవో శాలువాతో సత్కరించారు. పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని కీర్తన సావిత్రిబాయి పూలే వేషధారణతో ఆకట్టు కోగా విద్యార్థిని కీర్తనను కలెక్టర్, ఎమ్మెల్యే, అభినందించారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, నాగర్ కర్నూల్ మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి, నోడల్ అధికారి కురుమయ్య, సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, వెంకటయ్య, శోభారాణి, వెంకటేశ్వర్లు, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ పాండు, ప్రధానోపాధ్యాయురాలు లత మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment