శ్రీ ధర్మ శాస్త అన్నదాన సేవ సమితి కార్యక్రమానికి మాజీ మంత్రి
స్వాములకు అన్నదానం చేయడం అభినందనీయం
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి
సూర్యాపేట జిల్లా డిసెంబర్ 13 (తెలంగాణ కెరటం )అయ్యప్ప, శివ, గోవిందా, భవాని మాతతో పాటు అన్ని మాలాధారణం స్వాములకు శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శబరి నగర్ శ్రీధర్మశాస్త్ర అన్న ప్రసాద వితరణ కార్యక్రమం లో స్వామివారికి మహా నైవేద్యం సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో శ్రీధర్మశాస్త్ర సేవలను ముందుకు కొనసాగించాలని అన్నారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఆధ్యాత్మికత సేవతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక కథలు అలవర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వేంకట నారాయణ గౌడ్, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బూర బాల సైదులు గౌడ్, సుంకరి రమేష్, శ్రీధర్మ శాస్త్ర అన్నదాన సేవా సమితి సభ్యులు ఎర్రంశెట్టి ఉపేందర్, తోట నరసయ్య, మేరెడ్డి ప్రకాష్, గొట్టిపాటి శ్రీకాంత్, చికూరి కృష్ణ, మైలారపు శెట్టి కృష్ణ, చెంచల లక్ష్మణ్, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.